జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సక్సెస్ ఫుల్ యాక్టర్, కానీ ఫెయిల్యూర్ పొలిటిషియన్ కాదని విమర్శలు చేశారు అంబటి రాంబాబు. పవన్‌కల్యాణ్ చాలా ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నారు కానీ ఎప్పుడూ గెలిచింది లేదన్నారు.
ఆయన పాత్రను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. పవన్ సక్సెస్‌ఫుల్ యాక్టర్ . కానీ ఫెయిల్యూర్ పొలిటిషియన్. ఇది వాస్తవమన్నారు అంబటి రాంబాబు.
రంగా దారుణ హత్యకు తెలుగుదేశం కారణం కాదా ? బీసీల్లో చేరుస్తామని కాపుల్ని మోసం చేసింది తెలుగుదేశం కాదా ? అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబాన్ని హింసించింది తెలుగుదేశం కాదా ? అని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీటికి సమాధానం చెప్పగలరా ! అని ప్రశ్నించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.