ఆ దేవుడితో టైం వేస్ట్..పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమాపై బండ్ల సంచలన వ్యాఖ్యలు

-

ఆ దేవుడితో టైం వేస్ట్ అంటూ పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమాపై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా చేయాలని బండ్ల గణేష్‌ ఆతృత పడుతున్నారు. అయినా పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఛాన్స్‌ ఇవ్వడం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చే కొత్త మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయనున్నట్లు డి వి వి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.

రన్ రాజా రన్ అలాగే సాహో సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ సినిమాకు డైరెక్టర్ అని తెలిపింది చిత్ర బృందం. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసిన చిత్ర బృందం ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే.. ఈ పోస్టర్‌ ను ఉద్దేశించి.. బండ్ల ట్వీట్‌ చేశారు. వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం, దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం, లేకపోతే టైం వేస్ట్ అన్నారు. అలాగే, భారత చలన చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా నిలవాలని నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బండ్ల గణేష్ ట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news