ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని ,శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని నట్టి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ,విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు.
వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఈ దుస్థితి వచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ ప్రముఖులు దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాంలకు ఓటమి తప్పదన్నారు.నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీగా విజయం ఖాయం అని ఆయన అన్నారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ లక్షా పదివేల ఓట్ల మేజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. కూటమికి సినిమా ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ,వైయస్ జగన్ దుర్మార్గాలను ఆయన చెల్లెళ్లు వైయస్ షర్మిల, సునీత రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారని గుర్తు చేశారు.