ప్రధాని నరేంద్ర మోడీ పై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైనా సెలవు తీసుకున్నారని మీరు విన్నారా..? అని ప్రశ్నించారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రాజంపేట లోక్ సభ పరిధిలో ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా వచ్చేసిన  ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. పేద మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు రేప‌టికి వాయిదాప్రజల కోసం ప్రతీ క్షణం శ్రమించే శ్రామికుడు ప్రధాని మోడీ అన్నారు. మే 13వ తేదీ వరకు శ్రమించి ప్రధానిని నరేంద్ర మోడీని మరోసారి చేయాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి.

370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేస్తే.. అటు దేశం, ఇటు రాష్ట్రం అభివృద్ధి  చెందుతుందని తెలిపారు. అందు కోసం కమలం గుర్తు పై ఓటు వేయాలని కోరారు. అలాగే సైకిల్, గాజు గ్లాస్ గుర్తులపై ఓటు వేసి రాష్ట్రంలో చంద్రబాబును సీఎంగా, దేశంలో ప్రధాని మోడీని గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news