గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ను ఓడించడం ద్వారా వారి ప్లే ఆఫ్ అవకాశాలకు గండి పడింది అని చెప్పాలి. నిన్న మ్యాచ్ ముందు వరకు పంజాబ్ 12 పాయింట్ లతో ఉండగా, మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్ లు సాధించి కనీసం రేస్ లో ఉండేది. కానీ ఢిల్లీ తో ఓటమి ద్వారా అవకాశాలు సన్నగిల్లాయి. ఇక చివరి మ్యాచ్ లో భారీ తేడాతో గెలిచి మిగిలిన జట్ల ఫలితాల పైన ఆధారపడవలసి ఉంది. అయినా ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పటికే ప్లే ఆఫ్ కు దూరమైన ఢిల్లీ ఆఖర్లో పంజాబ్ ను భలే దెబ్బ తీసింది. ఇప్పుడు ఢిల్లీ కి మరో మ్యాచ్ చెన్నై తో ఉండడంతో అందరి కళ్ళు ఈ మ్యాచ్ పైనే నెలకొన్నాయి. చెన్నై ప్రస్తుతం 7 మ్యాచ్ లు గెలిచి పాయింట్ లతో ఉంది, ఆఖరి మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ కు ఖచ్చితంగా చేరుకుంది. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి.
IPL 2023: ఢిల్లీ ముందు మరో టార్గెట్… చెన్నై ను ఓడిస్తే చాలు … !
-