ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ తెలుసుకోవాలి!!

-

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలతో… రాజకీయ వర్గాల్లో ఒక విభిన్నమైన చర్చ నడుస్తోంది! అదేంటయ్యా అంటే… రాజకీయ నాయకులకు “రాజకీయాలు” తప్ప వారిలో మాములు “మనిషి” తాలూకు కొన్ని నాడులు చచ్చిపోయి ఉంటాయా..? అని!! పరిస్థితులతో ఏమాత్రం సంబందం లేకుండా.. చలించకుండా అవి చలనం లేకుండా ఉంటాయా..? అని!! అవును… ప్రస్తుతం ఈ విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటన, అనంతర పరిణామాల నేపథ్యంలో.. రాజకీయ వర్గాల్లో నడుస్తోన్న చర్చ ఇదే!!

విశాఖ దుర్ఘటన జరిగిన సమయం నుంచి… ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న కార్యాల‌యం నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తూ, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు దిశానిర్దేశిస్తూ వ‌చ్చారు. చ‌నిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా, మనసున్న వ్యక్తిగా కచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నానని… మృతుల కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లే వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరగానే కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లోని మొత్తం 15,000 మందికీ రూ.10 వేల చొప్పున న‌ష్ట ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. ఇది ఊహించని విషయమనే చెప్పాలి!

ఈ విషయంపై జగన్ ఇలా స్పందించేసరికి… ఎంతో కొంత డిమాండ్ చేసి, తమ మనుగడ కాపాడుకుందామని ప్రయత్నించిన ఇతర రాజకీయ పక్షాలకు ఆ ఛాన్స్ జగన్ ఇవ్వలేదు. సరికదా… జగన్ ప్రకటించిన నష్టపరిహారంతో సైలెంట్ అయిపోయారు! ఇక్కడ గమనించాల్సింది… విమర్శించే విషయంలోనూ, డిమాండ్ చేసే విషయంలోనూ బీజేపీ, కమ్యునిస్టులు, మొదలైన ఇతర రాజకీయ నాయకుల్లో “రాజకీయ నాయకుడు” మాత్రమే సైలంట్ అయిపోయాడు! కానీ… వారిలో ఉన్న మామూలు “మనిషి” మాత్రం స్పందించాడు. జగన్ చేసిన పనికి అందరిలాగానే అభినందించాడు! వీరిలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణతో సహా కమ్యునిస్టు నాయకులు, ఇతర రాజకీయ ప్రముఖులు, పెద్దలూ అంతా ఉన్నారు! ఇందులో… తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గణబాబు కూడా జగన్ సర్కార్ భేష్ అంటున్నారు. ఈ సమయంలో కూడా రాజకీయంగా మాట్లాడటం సమంజసం కాదని… ఆయనలోని రాజకీయ నాయకుడు సైలంట్ అయ్యి… మనిషి మాత్రమే స్పందించాడు… జగన్ ని అభినందించాడు! మరోవైపు నేషనల్ మీడియా సైతం జగన్ చేసిన పనిని అభినందించాయి!

ఇంతజరుగుతున్నా…. టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ… జగన్ ను అభినందించే పనికి పూనుకోలేదు! అసలు జగన్ ప్రకటించిన నష్టపరిహారంపై స్పందించను కూడా లేదు! కనీసం చాలు అనో, చాలలేదు ఇంకా ఇవ్వాలనో కూడా అనలేకపోయారు! బాధితుల‌ను త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని, అత్యున్న‌త వైద్య స‌హాయం అందించాల‌ని, స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని చంద్రబాబు డిమాండ్ చేస్తే… విశాఖ‌కు చెందిన జ‌న‌సేన నాయకుల‌తో టెలికాన్ఫ‌రెన్స్‌ నిర్వహించి, ఎల్‌జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు, వారంద‌రికీ ధైర్యం చెప్పాల‌ని జ‌న‌సేన నాయ‌కుల‌కు ప‌వ‌న్ దిశానిర్దేశం చేశారు. అంతే తప్ప… వీరిద్దరికీ మాత్రం జగన్ ను అభినందించాలనే మనసు మాత్రం రాలేదు.. వారిలో మనిషి మాత్రం కదల లేదు!! దీంతో… చూడటానికి వారు ఇద్దరు విడి విడి మనుష్యులే కానీ… ఆలోచనలు మాత్రం ఒక్కటే అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి!!

చంద్రబాబు అంటే.. కరోనా టైం నుంచి రాజకీయంగా ఇంక అన్నీ వదిలేసుకున్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు! చేసిన రాజకీయం చాలు.. ఇంక తన రాజకీయ భవిష్యత్తు కాలానికే వదిలేద్దాం అన్నట్లుగా ఆయన ఆలోచన ఉన్నట్లుగానే నడుచుకుంటున్నారు! కరోనా సమయంలో రాష్ట్రం మొత్తం దేవుడికెరుక, కనీసం కుప్పాన్ని కూడా పట్టించుకోకుండా… బాలకృష్ణకూ తనకూ పెద్దగా తేడాలేదని… తాను కూడా ఇంక అలా పార్ట్ టైం పొలిటీషియన్ గా మాత్రమే మిగిలిపోతానని ఫిక్సయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ… ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కూడా… సరైన సమయంలో సరైన ఆలోచనలు చేయకుండా, రిటైర్ అయిపోయినట్లు ప్రవర్తిస్తున్న బాబును ఫాలో అయితే… రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందనే కామెంట్లు.. విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి!! ఎందుకంటే… రాజకీయాల్లోకి వచ్చాక “ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో” పవన్ కచ్చితంగా తెలుసుకోవాలి కదా!!

Read more RELATED
Recommended to you

Exit mobile version