దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా విస్తరించే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ చాలా వరకు తీవ్రంగానే ఉన్నా… కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆరు రాష్ట్రాలు మాత్రమే ఇప్పుడు దీనితో బాగా ఇబ్బంది పడటం కనపడుతుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్.
ఈ రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రంగా ఉంది. అయితే దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ కూడా చెప్పారు. జూన్ జులై లో కరోనా వైరస్ దేశంలో పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మరణాలు కూడా పెరిగే అవకాశం ఉందని, జూన్, జులై నెలల్లో కరోనా లాక్ డౌన్ ఎంత వరకు ఉపయోగపడింది అనేది తెలుస్తుంది అన్నారు.
ఇక మహారాష్ట్రలోనే కేసులు లక్ష నుంచి 3 లక్షల వరకు రాబోయే రెండు నెలల్లో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పరిస్థితి మరీ తీవ్రంగా ఉండే సూచనలు ఉన్నాయని, లాక్ డౌన్ ని ఆరెంజ్ జోన్ లో కూడా కఠినం గా అమలు చేయడమే మంచిది అని భావిస్తున్నారట. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని లాక్ డౌన్ ని అమలు చెయ్యాలని చెప్తున్నారు.