పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్, మళయాలంలో సూపర్ హిట్ అనిపించుకున్న అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి రీమేక్ అని తెలిసిందే. మళయాలంలో ఈ సినిమాలో పృథ్వీ, బిజు మీనన్ నటించారు. చిన్న ఈగో క్లాష్ వల్ల వీరిద్దరి మధ్య పరిస్థితులు ఏ విధంగా మారాయన్నది సినిమా కథాంశం. ఐతే ఈ సినిమా ఇప్పుడు తమిళంలోకి రీమేక్ కి వెళ్లనుంది. అలాగే హిందీలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
హిందీ రీమేక్ హక్కులని జాన్ అబ్రహం కొనుక్కున్నాడు. తాజా సమాచారం ప్రకారం హిందీలో ఈ సినిమాలో జాన్ అబ్రహంతో పాటు అభిషేక్ బచ్చన్ కనిపించనున్నాడట. ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ, అభిషేక్ బచ్చన్ తో చర్చలు జరుపుతున్నారని వినిపిస్తుంది. హిందీ రీమేక్ కి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. మూడు భాషల్లో రీమేక్ అవుతున్న ఈ చిత్రం అన్ని భాషల్లోనూ హిట్ అనిపించుకుంటుందేమో చూడాలి.