ప్రపోజ్ డే ప్రాముఖ్యత.. తెలుసుకోవాల్సిన విషయాలు..

-

ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికుల్లో ఆనందోత్సాహాలు ఉప్పొంగుతాయి. అందుకే ఈ నెలని రొమాంటిక్ నెలగా పిలుస్తారు. ఐతే ఫిబ్రవరి నెల కేవలం ప్రేమికులకి మాత్రమే ప్రత్యేకమైనది కాదు. ప్రేమించే మనసున్న ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమే. ఆ ప్రేమ భార్యాభర్తల మధ్య కావచ్చు. స్నేహితుల మధ్య కావచ్చు. కుటుంబ సభ్యుల మీద కావచ్చు. తన తోటి వారి మీద కావచ్చు. ప్రకృతి మీద కావచ్చు. ఎవ్వరి మీదైనా ప్రేమ చూపించాల్సిన నెల ఇది.

ప్రేమికుల రోజు దగ్గరపడుతున్న సమయంలో దానికంటే ఒక వారం ముందు ప్రపోజల్ డే అని వస్తుంది. అంతే ఫిబ్రవరి 8వ తేదీన ఈ ప్రపోజల్ డేని జరుపుకుంటున్నారు. ఈ రోజున మీ మనసులోని భావాలన్నీ మీకు నచ్చిన వారికి చెప్పేయండి. ఎప్పటి నుండో మీలో దాచుకున్న భావాలని ప్రపోజల్ డే రోజున వారి ముందు ఉంచేయండి. మీ ప్రేమని చూడాలనుకున్న వారికి ప్రపోజల్ డే రోజున పరిచయం అవ్వండి.

ప్రేమని ప్రకటించడం అనేది చాలా పెద్ద విషయం. అందుకే ప్రేమించినవారెప్పుడూ ఆ విషయాన్ని చెప్పడానికి సంకోచిస్తూ ఉంటారు. ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమించడం చాలా ఈజీ, కానీ ఆ ప్రేమని ప్రకటించడమే చాలా కష్టం అనే మాట నూటికి నూరు పాళ్ళు నిజం. అవతలి వాళ్ళు అవునంటారో కాదంటారో అన్న సంధిగ్ధం ప్రేమించిన విషయాన్ని చెప్పనివ్వకుండా చేస్తుంది. చాలా మంది ఇలా దూరం నుండి ప్రేమిస్తూ, ఆ విషయాన్ని చెప్పకుండా కాలం గడిపేస్తూ ఉంటారు.

కానీ అది సరైన పద్దతి కాదు. ప్రేమ ప్రకటిస్తేనే బాగుంటుంది. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు అన్న సామెత గుర్తు తెచ్చుకోవాలి. అందుకే మీరు ప్రేమించిన వారికి ప్రపోజల్ డే రోజున ప్రేమ విషయం చెప్పేయండి.

Read more RELATED
Recommended to you

Latest news