పవన్ కల్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ఆయన్ని బూతులు తిట్టి వైసీపీ నేతలు..ఇంకా ఆయనలో కసి పెరిగేలా చేశారని చెప్పొచ్చు. ఏదో నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకుని కెలికినట్లు కెలుకుతున్నారు. దీంతో పవన్ తన కోపం ఏంటో వైసీపీకి చూపిస్తున్నారు. ఇంతకాలం ఎంత తిట్టిన కాస్త ఓర్పుతోనే కౌంటర్లు ఇచ్చారు. కానీ విశాఖ ఘటన, ఆ తర్వాత ఇప్పటం ఘటనతో పవన్ తనలో ఉన్న ఆగ్రహం ఏంటో చూపిస్తున్నారు. వైసీపీ వాళ్ళకు వారి బాషలోనే సమాధానం ఇస్తున్నారు.
అయితే ఇప్పుడు పవన్ కసి ఎంతలా ఉంది అంటే..ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని దించేయాలనే అంత కోపం ఉంది. అందుకే ఏం జరిగిన పర్లేదు. అరెస్ట్ అయిన పర్లేదు అనే విధంగా పవన్ ముందుకెళుతున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ ఆడియో రిలీజ్ చేశారు. మనల్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇండియాకు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు… ఏపీలో మాత్రం ఫ్యూడలిజం మాత్రం పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను బద్దలు కొట్టక తప్పదని అన్నారు.
అంటే వైసీపీని గద్దె దించాలనే కసి పవన్ లో ఎక్కువ కనిపిస్తోంది. వైసీపీ నేతలు పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, బూతులు తిట్టడం, తనని అడ్డుకునే కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో పవన్..పూర్తిగా రివర్స్ అయిపోయారు. అలాగే చంద్రబాబుతో కలిసి ఆయన వైసీపీకి చెక్ పెట్టే దిశగా ముందుకెళుతున్నారు.
ఇక వైసీపీకి చెక్ పెట్టడానికి వచ్చే జనవరి నుంచి పవన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించి వైసీపీ విధానాలని ప్రజలకు వివరించి..వైసీపీపై ఇంకా ప్రజల్లో ఆగ్రహం పెరిగేలా చేయడమే లక్ష్యంగా పవన్ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి జగన్‌ని గద్దె దించేవరకు పవన్ విశ్రమించేలా లేరు.