ఆ సినిమా గుర్తుకు వస్తే ఇప్పటికీ బాధ కలుగుతుంది.!

-

తెలుగు సినిమా పరిశ్రమ లో కమర్షియల్ సినిమాల కు కొత్త అర్దం చెప్పిన డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ .స్టార్ హీరోలతో మంచి సినిమాలను తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు. ఒకప్పుడు ఆయన తో సినిమా కోసం స్టార్ హీరోలు అందరూ వెయిట్ చేస్తూ వుండే వారు. చిరంజీవి , బాలకృష్ణ, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లతో సూపర్ హిట్స్ తీశారు.

తన సుమో చేజింగ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ అప్పట్లో ప్రేక్షకులను అమితంగా అలరించాయి. తాను చాలా ఇంటర్వ్యూ లో తన వల్ల సినిమా కు ఎప్పుడూ నష్టం కలగకుండా ఉండేందుకు చాలా రకాలుగా జాగర్తలు తీసుకుంటామని చెప్పారు. అందుకే తన సినిమాలకు మినిమం వసూళ్ళు వుంటాయి. తాను ఫామ్ లో ఉన్నప్పుడు చాలా మంది తమ వారసులను సినిమాలకు పరిచయం చేసేవారు. అయితే తన ఖాతా లో ఎన్ని హిట్స్ వున్నా ఒక్క ప్లాప్ గురించి మాత్రం ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అఖిల్ మొదటి  సినిమా గురించి విషయాలు పంచుకున్నారు. వాస్తవానికి ఈ సినిమా కోసం నాగార్జున లవ్ స్టోరీ అనుకుంటే అఖిల్ యాక్షన్ కథ కావాలని అనుకున్నాడట. చివరకి అఖిల్ కోరిక మేరకు భారీ బడ్జెట్ తో మొదటి సినిమా తీశారు. ఈ సినిమా కోసం అఖిల్ కూడా చాలా కష్టపడ్డాడు.కాని ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ అయ్యి మమ్ముల్ని చాలా నిరాశకు గురిచేసింది.. ఇప్పటికీ ఆ సినిమా గుర్తుకు వేస్తే చాలా బాధ కలుగుతుంది అని వినాయక్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version