పాయల్ క్లారిటీ : వాటిల్లో అది చేయట్లేదట..!

-

అందాల భామ పాయల్ రాజ్ పుత్ ‘పుష్ప’, ‘ఇండియన్-2’ చిత్రాలలో ఐటెమ్ సాంగ్స్ చేయబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. రెండు క్రేజ్ ఉన్న సినిమాలే కావడంతో ఆమె వెంటనే ఒప్పెసుకుందనేది ఆ ప్రచారం సారాంశం. అయితే ఈ విషయం మీద గతంలో ఒక సారి క్లారిటీ ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగలేదు. ఇక తాజాగా మరోసారి ఈ వార్తలపై పాయల్ రాజ్ పుత్ స్పందించింది. ‘పుష్ప’ చిత్రంలో తాను ఎలాంటి పాటలో నటించడం లేదని స్పష్టం చేసింది.

‘పుష్ప’ చిత్రంతో పాటు ‘ఇండియన్-2’ చిత్రంలో మీరు ఐటెమ్ సాంగులు చేస్తున్నారట కదా అంటూ గత కొన్నిరోజులుగా తనకు ఒకటే మెసేజ్‌లు వస్తున్నాయంది. ఇవన్నీ రూమర్లేనని, ప్రస్తుతం తాను ఏ సినిమా చేయడం లేదని పాయల్ తెలిపింది. అయితే తనకు కెరీర్ విషయంలో ఎలాంటి కంగారు లేదని, తనకోసం మంచి సినిమాలు వస్తాయని, ప్రస్తుతం లాక్ డౌన్ లో స్క్రిప్ట్స్ వింటున్నానని, అన్ని విషయాలకు త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలిపింది పాయల్.

Read more RELATED
Recommended to you

Latest news