పేటీఎం వంద కోట్ల విరాళం… ఎలా అంటే…!

-

కరోనా వైరస్ తో దేశం పోరాడుతున్న సమయంలో ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. విద్యార్ధులు, రైతుల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అందరూ కూడా తమ వంతుగా సహాయం చేస్తూ దేశానికి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధి తో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ సహాయ నిధికి కూడా తమ వంతుగా సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కరోనాను ఎదుర్కోవడానికి గాను ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు భారీగా పేటీఎం నుంచి వంద కోట్లు అందాయి. ఈ విషయాన్ని సంస్థ తాజాగా ప్రకటించింది. రూ.500 కోట్ల సేకరణే లక్ష్యంగా పేటీఎం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దీనికి ఎవరు అయినా సరే విరాళాలు అందించవచ్చు అని పేర్కొంది. పేటీఎం ద్వారా ఇచ్చే ప్రతి విరాళానికి, చేసే ప్రతి లావాదేవికీ తమ తరఫున అదనంగా రూ.10 కలుపుతామని సంస్థ పేర్కొంది.

దీనిపై స్పందించిన సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు 10రోజుల్లో రూ.100 కోట్లు సమకూర్చామని ఆయన పేర్కొన్నారు. సంస్థలోని ఉద్యోగులు సైతం విరాళాలు అందించారని ఆయన చెప్పారు. కొంతమంది ఉద్యోగులు మూడు నెలల వేతనం కూడా అందించారు. దేశ ప్రజలంతా ముందుకు వచ్చి పీఎం-కేర్స్‌లో భాగస్వామ్యం కావాలని పేటీఎం కోరింది. పేదవారి ఆకలి తీర్చడానికి కేవీఎన్‌ ఫౌండేషన్‌తో కలిసి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news