మొత్తానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇంతవరకు కుప్పం అంటే బాబు అడ్డాగానే ఉంది. ఆయన కాలు పెట్టకపోయినా సరే కుప్పం ప్రజలు..బాబుని గెలిపించుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో కూడా బాబు అసలు కుప్పంలో కాలు పెట్టలేదు. అయినా సరే ప్రజలు ఆయన్ని మళ్ళీ గెలిపించుకున్నారు. కానీ అక్కడ నుంచే సీన్ మొత్తం మారింది.
దీంతో బాబుకు సీన్ అర్ధమైంది…కుప్పం వెళ్లకపోతే పరిస్తితులు తారుమారవుతాయని తెలుసుకుని, కుప్పం వెళ్లారు. అటు నారా లోకేష్ కూడా కుప్పంలో ప్రచారం చేశారు. అయినా సరే మున్సిపాలిటీలో వైసీపీ హవాని అపలేకపోయారు. కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. దీంతో కుప్పంలో బాబు పని అయిపోయిందని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో బాబు అలెర్ట్ అయ్యారు. ఇక తరుచూ కుప్పం వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ మధ్యే అక్కడే సొంత ఇల్లు కూడా కట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా మరొకసారి కుప్పం వెళ్ళి ప్రజలని కలవాలని బాబు డిసైడ్ అయ్యారు. అక్కడ పార్టీ నాయకులని సమన్వయం చేసుకుని, ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేశారు. ప్రజల్లో ఉన్న నెగిటివ్‌ని తొలగించాలనే లక్ష్యంతో బాబు కుప్పం వెళ్లనున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లోపు కుప్పంలో పరిస్తితులని తమకు అనుకూలంగా మార్చుకోకపోతే..ఈ సారి బాబు పరిస్తితి అస్సామే.