నేను టీఆర్ఎస్ కోవర్టు కాదు.. కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్ ఉంది : జగ్గారెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి…. వివాదాలు బయటపడ్డాయి. తాజాగా రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను టీఆర్‌ఎస్‌ పార్టీకి కోవర్డు కాదని… కాంగ్రెస్‌ ఓ చిల్లర బ్యాచ్‌ అలా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోవాలనుకుంటే.. టీఆర్‌ ఎస్‌ పార్టీలోకి వెళ్లేవాడినేనని చెప్పారు. పిసిసి అంటే..బస్సుకు డ్రైవర్ లాంటి వాడేనని… బస్సు సక్కగా లేకుంటే.. సరిద్దిద్దుకో అని చెప్పానని చురకలు అంటించారు. ఇది కూడా చెప్పొద్దా..? అని ప్రశ్నించారు.

కెసిఆర్ నా కంటే పెద్ద.. తిట్టను.. నా కంటు ఓ పద్ధతి ఉంటదన్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ నీ సంగారెడ్డి కి ఎట్లా వస్తవో రా..? అని ఎదురు నిలబడ్డా అని గుర్తు చేశారు. నా కంటే ఎక్కువ కొట్లాట ఎవరన్నా చేశారా..? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. నా మీద చెయ్ వేసి కేటీఆర్ మాట్లాడితే కోవర్ట్‌ అన్నారని.. మరి కిషన్ రెడ్డీ..కేటీఆర్ కలిసి దిగిన ఫోటో ఇవాళ వచ్చింది… దీన్ని ఏమంటారు.? అని చురకలు అంటించారు. మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లాక్కుంటున్న ఫోటోలు వచ్చాయని… మరి దీన్ని ఏమంటారని రేవంత్‌ రెడ్డి పై ఫైర్‌ అయ్యారు. దీనికి జవాబు చెప్పకుండా మాట్లాడితే తోడ్కలు తీస్తానని వార్నింగ్‌ ఇచ్చారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version