ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. నిన్న అధికారులను బెదిరించేలా మాట్లాడిన ఆయన వ్యాఖ్యల మీద ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయనను హౌస్ అరెస్ట్ లో ఉంచాలని ఆయన ఆంధ్రప్రదేశ్ డిజిపి కి ఆదేశాలు జారీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్నికలు సజావుగా సాగేందుకు ఆయనను ఈ విధంగా హౌస్ అరెస్ట్ లో ఉంచాలని పేర్కొన్నారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని లేఖలో డీజీపీని ఆదేశించారు నిమ్మగడ్డ. నిన్న గుంటూరు చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ మాట విని ఎవరైనా అధికారులు ఏకగ్రీవాలు అనుమతించకపోతే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భర్తరఫ్ చేయమని కోరే అవకాశం కనిపిస్తోంది.