మేకలతో వీడియో కాల్.. ఆదాయమే ఆదాయం..!

-

ప్రపంచాన్ని కరోనా వైరస్ అందరినీ అతలాకుతలం చేసింది. వ్యాపార రంగాలు, ఉద్యోగస్తులు ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగస్తులను కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమయ్యారు. ఆ సమయంలో చాలా మంది ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు ఫన్నీగా స్టార్ట్ చేసిన వర్క్ ఇప్పుడు వారికి ఆదాయంగా మారింది. లాక్‌డౌన్‌లో ఉద్యోగస్తులు జూమ్ యాప్‌లో వీడియో కాల్ చేసి వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో పిల్లల అల్లర్లు, పెంపుడు జంతువుల ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

goat

ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఔత్సాహికులకు ఇవే ఆదాయ మార్గాలుగా మారాయి. తాజాగా ఇలాంటి వార్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి హల్ చల్ చేస్తోంది. ఇంగ్లాండ్‌లోని లాంక్ షైర్‌కు చెందిన ఒక రైతు మెక్ కార్తీ నెలకు 50 వేల డాలర్లు సంపాదిస్తోంది. సరదాగా చేసిన పని.. ఆమె ఆదాయ మార్గమైంది. వర్క్ ఫ్రమ్ హోం అప్పుడు జూమ్ యాప్‌లో మీటింగ్ నిర్వహించేటప్పుడు చేసిన పనే ఆమె జీవితాన్ని మార్చేసింది. మీటింగ్ సమయంలో ఆమె వీడియోను తన పొలంలో ఉన్న మేకలవైపునకు చూపిస్తూ ఉండేది. దీంతో మీటింగ్‌లో పాల్గొనే ఉద్యోగులు ఆసక్తికరంగా వీడియోని వీక్షించేవారు.

పొలంలో ఉన్న మేకలను చూపిస్తూ కూర్చునేది. ఈ వీడియోలు చూసిన ఉద్యోగులు ఆసక్తిగా వీక్షించడంతో.. అలా వీడియోను కొద్ది సేపు ఉంచేది. దీంతో మెక్ కార్తీ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మేకలను వీడియో కాల్‌లో చూపించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా, రష్యా, చైనా యూఎస్‌ దేశాల్లో ఈ వీడియోలోని మేకలకు ఫ్యాన్స్ ఫాలొయింగ్ పెరిగింది. వేరే దేశాల నుంచి ఫోన్ చేస్తుంటారు. ఈ వీడియోకు మెక్ కార్తీ కొంత మొత్తాన్ని చార్జ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news