కథనం: ఈవీఎంల గురించి ఆలోచించాల్సిందేనా?

-

- Advertisement -

దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఏకైక అనుమానం ఈవీఎంల టాంపరింగ్. ఓడిపోయిన ప్రతీ సారి పార్టీలు ఈవీఎంలను హ్యాకింగ్ చేస్తున్నారంటూ ఆరోపించడం సర్వ సాదారణమే.. అలా అని టాంపరింగ్ కావడం లేదు అని నిరూపించడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో.. సైబర్‌ నిపుణుడిగా పేర్కొంటూ..ఈవీఎం హ్యాకింగ్‌పై రెండు రోజుల క్రితం సయ్యద్‌ షుజా అనే వ్యక్తి  వెల్లడించిన అంశాలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేయడం చాల సులువంటూ పలు టెక్నిక్స్ ని కూడా వివరించారు. భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని అందరికి తెలిసిందే. అలాంటి దేశంలో ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే ఆ పార్టీ అధికారంలోకొస్తుంది. ఇప్పటి వరకు ప్రజల్లో అదే అభిప్రాయం కొనసాగుతోంది కూడా.. ఈవీఎంలపై రాద్దాంతం కొనసాగుతున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సందేహాలు సైతం పుట్టుకొస్తున్నాయి. ఓటు ఎవరికి వేసిన ప్రోగ్రామర్ ఏ పార్టీకి పడాలని ప్రొగ్రామ్ చేస్తే దానికే పడుతోంది అంటూ పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా వివరించే విషయాలను సైతం మనం గమనిస్తున్నాం. ఇదిలా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంలకు వీవీప్యాట్‌లను అమర్చాలని ఎలక్షన్ కమిష్ కు పలు సార్లు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఓటరు తాను వేసిన ఓటుని ఏ పార్టీకి వేశాడో చిన్న స్లిప్ రూపంలో చూసుకోవచ్చు.

అయితే ఓట్ల లెక్కింపు సమయంలో వీటిని పరిగణించరు. ఒక్కో నియోజకర్గంలో లాటరీ వేసి ఒక్క వీవీప్యాట్‌లోని రసీదులనే లెక్కించి అంతా సజావుగానే ఉన్నట్లు నిర్దారిస్తారు. ఇంత వరకు ఓటింగ్ ప్రక్రియ కౌంటింగ్ విధానం బాగానే ఉంది. మరి స్లిప్ లను ఎందుకు లెక్కించరంటూ సామాన్యుడిలో సైతం రగులున్న ఓ సందేహం. అన్నింటికంటే ముఖ్యంగా.. పార్లమెంట్‌ ఎన్నికలకు మూడు నెలల ముందు ఈవీఎంలతో  సహా అన్ని ఎలక్ట్రానిక్‌ సమాచార సాధనాలూ కేంద్ర నిఘా సంస్థల గుప్పెట్లోకి వచ్చేలా మోడీ సర్కారు నూతన ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో దేశ ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుని వారు డీకోడ్ చేసే అవకాశం లేకపోలేదు అనేది కొంత మంది నిపుణుల అభిప్రాయం.

ఈ మధ్య కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహింటప్నం నియోజకవర్గంలో రెండు వర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపులో ఇటు ఈవీఎంలలో అటు వీవీప్యాట్ స్లిప్ లలో తేడా వచ్చినట్లు గమనించామని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయుదంగా మలుచుకుని కోర్టుకు సైతం వెళ్లిన వారు ఉన్నారు. ఇలా ఒకే ఓటరు వేసిన ఓటులో తెడాలు వస్తే నమ్మెది ఎలా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి సందేహాలను తీర్చాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీనిపై పలువురు కేంద్రాన్ని ప్రశ్నించగా వీవీప్యాట్ ల కౌంటింగ్ అనేది భారీ ఖర్చుతో కూడుకున్నట్లు వారు పలు మార్లు వివరించారు. పాత పద్ధతిలోనే పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవంటూ కొందరు ముఖ్యమంత్రులు సైతం కేంద్రాన్ని కోరారు. ఇలా ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటే… అసలు ఓటు ఎవరికి వేశాం అనేది ఓటరుకి ఉన్న పెద్ద సందేహం. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు – వీవీప్యాట్ ల గురించి వస్తున్న ఆరోపణలపై ప్రజలకు క్లారిటి ఇవ్వాలిన అవసరం ఎంతైన ఉంది. లేకపోతే పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ నిర్వహిస్తే ఇలాంటి ఆరోపణలకు తావు ఉండదు కదా.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...