అల్లు అర్జున్ కావాలని అంటాడో లేక అలా ఫ్లోలో వచ్చేస్తాయో తెలియదు కాని ఈమధ్య బన్ని మాట్లాడే మాటలు నెటిజెన్స్ కు మంచి స్టఫ్ దొరికేలా చేస్తున్నాయి. మొన్నామధ్య పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ గారు.. సాయి పల్లవి గారు అంటూ గాట్టిగా క్లాస్ ఇచ్చిన బన్ని నిన్న జరిగిన లవర్స్ డే ఆడియో ఈవెంట్ లో మళ్లీ దొరికిపోయాడు. వేదిక మీద ఉన్నప్పుడు మైక్ అందుకుంటే ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడకు వెళ్లాలో కాస్త ఆలోచించాలి.
నిన్న ఈవెంట్ లో బన్ని బాహుబలి కిల్డ్ కట్టప్ప అని టంగ్ స్లిప్ అయ్యాడు.. అది పోనీలే అనుకోగా తాను సౌత్ ఇండియన్ స్టార్ అని చెప్పాడు. అంటే బన్ని మాటల్లోని ఉద్దేశం ఏంటంటే తాను కేవలం తెలుగు నటుడిని కాదు సౌత్ ఇండియా స్టార్ ని అన్నట్టుగా చెప్పాడు. తన సినిమాలు కేరళ, కర్ణాటకలో బాగా ఆడుతున్నాయి కాబట్టి బన్ని తనని అలా అనుకున్నాడు.
అయితే ఇదే బన్ని మాటని నా పేరు సూర్యలో డైలాగ్ తో ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. అందులో సౌత్ ఇండియన్ కా సా.. అన్న డైలాగ్ వస్తుంది. అయితే అప్పుడు సూర్య పాత్రలో ఉన్న బన్ని సౌత్, నార్త్, ఇన్ని ఇండియాలు లేవురా ఉన్నది ఒకటే ఇండియా అంటూ పెద్ద డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ సినిమాలో వరకే.. నిన్న వేడుకలో సౌత్ ఇండియన్ స్టార్ అనడం ట్రోల్ చేసే వారికి ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది.