తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.08 లక్షలు

-

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.08 లక్షలుగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ప్రతీ ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియంకు చేరుకున్న సీఎం తొలుత అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు, వారి చదువు వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

తొమ్మిది పదేళ్ళ క్రితం మనల్ని వెనుకబడినవారిగా పరిగణించేవారు. కానీ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే పోటీ అనేది లేదు. ఇది నేను చెప్తున్నది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోనే మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000 – 1050 యూనిట్లు ఉండేది. నేడది రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు చేరుకున్నది. దేశంలోనే మనం అత్యున్నత స్థానంలో నిలిచామని వివరించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news