మహిళల కోసం మరచిపోలేని గిఫ్ట్ అందించిన మునిసిపాలిటీ.. దేశంలోనే ఫస్ట్ !

-

జీవితంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎప్పుడు అని ఏ మ‌హిళ‌ను ప్ర‌శ్నించినా పీరియ‌డ్స్ అని ట‌క్కున చెప్పేస్తారు. ఎంతో బాధాకరమైన తిమ్మిర్ల‌ నుంచి మూడ్ స్వింగ్స్ వరకు రుతుస్రావం స‌మ‌యంలో మ‌హిళ‌లు ఎన్నో రకాల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరయిన ఇల్లు కూడా లేని వారి పరిస్థితి ఇంకా దారుణం.

అందుకే రద్దీగా ఉన్న మురికివాడల్లో నివసించే మహిళల ఋతు స్రావం సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి మరియు వారికి పరిశుభ్రమైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో, మహారాష్ట్రలోని థానే నగరంలోని ఒక పబ్లిక్ టాయిలెట్ వద్ద “పీరియడ్ రూమ్” ఏర్పాటు చేయబడింది. పబ్లిక్ టాయిలెట్ వద్ద యూరినల్, జెట్ స్ప్రే, టాయిలెట్ రోల్ హోల్డర్, ఒక సబ్బు, రన్నింగ్ వాటర్ మరియు డస్ట్‌బిన్‌తో కూడిన సదుపాయం ఏర్పాటు చేశామని అధికారి ఒకరు తెలిపారు. గత సోమవారం వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలోని శాంతి నగర్ ప్రాంతంలోని ఒక మురికివాడలో థానే మునిసిపల్ కార్పొరేషన్ ఒక ఎన్జీఓ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పీరియడ్ రూమ్ ఈరోజు ప్రారంభించబడింది.

Read more RELATED
Recommended to you

Latest news