దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్ suvidha.eci.gov.in వినియోగించాలని సీఈవో ముకేశ్‌కుమార్ మీనా కోరారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ, తెలుగుదేశం పార్టీ, బీజేపి ,కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇంటింటి ప్రచారానికి, సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.సభలు, ర్యాలీలు, ప్రచారంపై 48 గంటల ముందుగానే సువిధ యాప్, పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని తెలిపారు.