బుక్ మైషో , జస్ట్ బుకింగ్, పేటిఎం వంటి సినిమా టికెట్లు అమ్మే వెబ్సైట్, యాప్ యాజమాన్యాలతో మంత్రి పేర్నినాని సమావేశం కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో పేర్నినాని సమావేశం కానున్నారు. ఇప్పటికే సినిమా ఆన్లైన్ టికెట్ ల వ్యవహరంలో సినిమా హళ్ళతో ఒప్పందం టికెటింగ్ యాప్స్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ప్రభుత్వ ఆన్లైన్ టికెట్ంగ్ కు ప్రైవేటు టికెటింగ్ యాప్ కంపెనీలు అవరోధం అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే వారితో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ గతంలో తీసుకువచ్చిన ఆన్ లైన్ టికెటింగ్ విధానం పై ఇండస్ట్రీ నుండి భిన్నాబిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ సర్కార్ తాజాగా టికెట్ రేట్ల పై ఆంక్షలు విధించడం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని కండిషన్లు పెట్టడంపై చిత్ర పరిశ్రమ నుండి తీవ్రవ్యతిరేఖత ఎదురవుతోంది. సినీ ప్రముఖులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.