నేడు ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకంపై సచివాలయంలో 11 గంటలకు ఏపి ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో మంత్రి పేర్ని నాని సినీ పెద్దల తో చర్చించనున్నారు. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు తదితరులను ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. ఆన్ లైన్ లో టిక్కెట్ల అమ్మే అంశంపై మంత్రి పేర్ని నాని అభిప్రాయాలు.. సలహాలు తీసుకోనున్నారు. ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైములో ట్రాన్సఫర్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఏపీ ఎఫ్డీసీ ద్వారా ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ను నిర్వహించనున్నట్టు ప్రభుత్వం సినీ నిర్మాతలకు వివరించనుంది. ఇక ఇప్పటికే పలువురు నిర్మాతలు.. సినీ ప్రముఖులు థియేటర్ యాజమాన్యాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపి ప్రభుత్వం తీసుకుని వస్తామని ప్రకటించిన ఆన్లైన్ టికెట్ విధానం పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. లవ్ స్టొరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి కూడా ఏపి ప్రభుత్వం కనుకరించాలి అంటూ వ్యాఖ్యానించారు.