అజ్ఞాతవాసి అనుకున్నాం…అజ్ఞానవాసి అని కూడా అర్థం అయ్యింది

టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని పవన్ నాయుడు నిర్వహించారని  ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.  కాల్ షీట్ కు పూర్తి న్యాయం చేశాడన్న ఆయన పవన్ నాయుడు అద్దె మైక్ లాంటి వ్యక్తి 2014లో కాంగ్రెస్ హఠావో, దేశ్ కు బచావో అన్నాడని అన్నారు. 2019లో ఉత్తరాది బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే చులకన అన్నాడని పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నావ్ ..ఇప్పుడు అదే లడ్డు బాగుందని రంకెలేస్తున్నాడని అన్నారు.

అన్న ప్రాసన సమయంలోనే పాకుతూ వెళ్లి కత్తి, కొడవలి‌ , ఎర్ర జెండా పట్టుకున్నానని చెప్పాడన్న ఆయన అబద్ధాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుందని అన్నారు. ఒకే మీటింగ్, రెండు కాల్ షీట్లు… తిరుపతి వచ్చినా వెంకన్న స్వామి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. విమానం దిగి నోటికి వచ్చింది మాట్లాడి మళ్ళీ విమానం ఎక్కి వెళ్ళిపోయాడని  వివేకానంద రెడ్డి కేసు ఎక్కడ ఉందో ..పవన్ కళ్యాణ్ కు తెలుసా? అని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్ట్ గా హోమ్ మంత్రి అమిత్ షా అధీనంలో పని చేస్తుంది… అక్కడ అడగాలంటే భయమా? అని ప్రశ్నించిన ఆయన అజ్ఞాతవాసి అనుకున్నాం…అజ్ఞానవాసి అని కూడా అర్థం అయ్యిందని అన్నారు.