పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్…. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

-

పవన్ కళ్యాణ్ హాబీగా రాజకీయాలు చేస్తుంటారని.. పుల్ టైమ్ పొలిటీషీయన్ వేరని, పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క మాట మీద నిలబడ్డారా..? అని ప్రశ్నించారు పేర్ని నాని. 2012లో పార్టీ పెట్టడానికి చంద్రబాబును కలిశానని అన్నారు.. చంద్రబాబు ఏమైనా ఎలక్షన్ కమిషనా అని అన్ని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబుకు ఓటేయాలని, మోదీకి ఓటేయాలని పవన్ కళ్యాణ్ అన్నారని అన్నాడు. 2017లో గుంటూర్ లో మీటింగ్ పెట్టి చంద్రబాబు, లోకేష్ ను తిట్టాడని గుర్తు చేశారు. 2019లో సీపీఐ, సీపీఎం పార్టీలతో జత కలిశారని.. చెగువేరా ఫోటోను పట్టుకున్నాడని,  ఆతరువాత చెగువేరా అయిపోయారని, పూలే అయిపోయారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బీజేపీ చీల్చినప్పుడు నిద్రపట్టలేదని, ప్రత్యేక హోదా, పాచిపోయిన లడ్డులు అంటూ బీజేపీని తిట్టాడని, ఆతరువాత ఇప్పుడు బీజేపీతో జతకట్టాడని పవన్ కళ్యాణ్ ను విమర్శించారు పేర్ని నాని. బీజేపీ చంకలో ఉంటూ, చంద్రబాబుకు కన్నకొడతాడు అంటూ పవన్ కళ్యాన్ ను విమర్శించారు. చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని పేర్ని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news