పెట్ డాగ్స్ ఉన్న వారంతా ఈ రూల్స్ పాటించాల్సిందేనంట

-

ఇప్ప‌డున్న అడ్వాన్సెడ్ యుగంలో ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో పెంపుడు పిల్లులు లేదా కుక్క‌లు అనేవి భాగం అయిపోయాయి. ఇవి లేని ఇల్లు మ‌నకు న‌గ‌రాల్లో అయితే అస్స‌లు క‌నిపించ‌ద‌నే చెప్పాలి. ఇక ఇప్పుడు న‌గ‌రాల్లో అయితే ఈ పెంపుడు కుక్క‌లు కుటుంబంలో భాగ‌మ‌యిపోతున్నాయి. పెట్ డాగ్స్ ( Pet Dogs ) ని కూడా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాగే పెంచుకుంటున్నారు కుటుంబీకులు.

Pet Dogs | పెట్ డాగ్స్
Pet Dogs | పెట్ డాగ్స్

ఇక‌వ వీటికి ఎంతో ప్రేమ‌గా సెప‌రేట్ బెడ్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక సాయంత్ర లేదా మార్నింగ్ అయితే చాలు వీటిని తీసుకుని రోడ్ల మీద లేదంటే పార్కుల వ‌ద్ద ప‌రుగులు తీస్తుంటారు య‌జ‌మానులు. ఇలాంటి టైముల్లోనే అవి వేరే వారిని కరవడం ఇబ్బందులకు గురి చేయ‌డం లాంటివి చూస్తుంటాం.

కాబ‌ట్టి ఇలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది బెంగుళూరు మున్సిపాలిటీ. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఇక పెంపుడు కుక్కల‌కు ఉంటే వాటికి క‌చ్చితంగా రేబీస్‌ వ్యాక్సిన్ వేయాల్సిందే. బ‌ట‌య‌కు ఎప్పుడు ప‌డితే ఇప్పుడు తీసుకెళ్లొద్దు. బ‌ట‌య‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కుక్క‌ల నోటికి బుట్టను పెట్టాల్సిందే. ఒక‌వేళ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కుక్క‌లు కాలకృత్యాలు చేస్తే వాటిని య‌జ‌మానులు క్లీన్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news