ఇండియా లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అస్సలు తగ్గేలా కనిపించడం లేదు. రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. ఇప్పటికే ఇండియా లోని చాలా రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టగా డీజిల్ ధరలు కూడా అదే బాట పట్టాయి. తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 0.35 పైసలు మరియు లీటర్ డీజిల్ పై 0.35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106. 19 కు చేరగా డీజిల్ ధర రూ. 94. 92 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110. 92 కు చేరగా డీజిల్ ధర రూ. 103 . 91 కు పెరిగింది. ముంబై లో రూ. 112. 11, కు చేరగా డీజిల్ ధర రూ. 109. 04 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113. 00 కు చేరగా డీజిల్ ధర రూ. 105. 55 కు చేరుకుంది. సెప్టెంబర్ 5 వ తేదీ తర్వాత డీజిల్ ధర రూ. 6.85, పెట్రోల్ ధర రూ. 5.35 మేర పెరిగింది.