న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత యాభై రోజుల్లో మరీ విపరీతంగా పెరిగిపోయాయి. మొత్తం 28 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మే 4 తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 7 రూపాయలకు పైగా రేటు పెరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమపై పెట్రో బాంబు మరింత కష్టాల్లోకి నెట్టిందంటున్నారు. పెట్రో ధరల పెంపుతో అటు నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
28 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు.. గగ్గోలు పెడుతున్న జనం
-