వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గతం కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు మరోమారు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడు భరించ లేని విధంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 31పైసలు, లీటర్ డిజిల్ పై 38 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.08 ఉండగా, లీటర్ డిజిల్ ధర దాదాపు సెంచరీని చేరింది. ప్రస్తుతం లీటర్ డిజిల్ ధర రూ. 99.75గా ఉంది. ఇప్పటికే ప్రజలు పెట్రోల్ భారం మోయలేకుండా ఉన్నారు. తమ సంపాదనలో సింహభాగం పెట్రోల్, డిజిల్ కే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పెరుగుతున్న చమురు ధరలు ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రంగాలపై పడుతోంది. వినియోగ వస్తువుల నుంచి అన్నింటి ధరలు పెరుగుదలపై ప్రభావం చూపిస్తున్నాయి. పెరగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రానిక్ వాహనాల వంటి ప్రత్యామ్నాయాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.