గర్భిణీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకునే వారికి రూపాయలు రూ.11 వేలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఉచిత వైద్య సేవలు, మందులు, ఆహారం, రవాణాతో పాటు ఈ 11,000 అదనంగా ఇవ్వనున్నారు.
ఈ మొత్తాన్ని కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత మొత్తాన్ని ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ద్వారా ఈ పథకం గురించి ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించింది. అంతేకాకుండా పురిటి నొప్పులు వస్తే 108 కు ఫోన్ చేసిన వెంటనే అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తీసుకు వెళుతుంది అక్కడ ప్రసవం జరిగిన తర్వాత మళ్ళీ బిడ్డతో పాటు అదే అంబులెన్స్ ఇంటికి చేరుస్తుంది. ఇక గర్భిణీలు రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బోధనా స్పత్రి వరకు ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు.