మళ్లీ భగ్గుమన్న పెట్రోల్ ధరలు

మళ్లీ పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. వరసగా పెరుగుతున్న ధరలు వాహనాదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. తాజాగా మరోమారు పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు సామాన్యుడికి శరాఘాతంగా మారాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 31 పైసలు, డిజిల్ పై 38 పైసలు పెరిగాయి. 

ఇన్నాళ్లు పెట్రోల్ ధరలు మాత్రమే సెంచరీ దాటగా, ప్రస్తుతం డిజిల్ ధరలు కూడా సెంచరీని దాటి పెట్రోల్ ధరలకు తీసిపోని విధంగా పెరుగుదలను నమోదు చేసుకుంటుంది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.64 ఉండగా లీటర్ డిజిల్ ధర రూ.101.65 గా ఉంది. గడిచిన పది రోజుల్లో డిజిల్ ధరలు పెరగడం ఇది పదోసారి. వరసగా పెరుగుతన్న ధరల కారణంగా సామాన్యుడిపై భారం పడుతోంది.