పీఎఫ్‌ అకౌంట్‌లో ఫోటో అప్‌డేట్‌ చేయాలా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ పీఎఫ్‌ చందాదారుల కోసం చాలా రకాల సర్వీసులని తీసుకు వచ్చింది. ఈ సర్వీసుల ద్వారా మనం ఈజీగా ఇంట్లో వుండే పనులు చేసుకోవచ్చు. పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి మనం ఈ సేవలని పొందొచ్చు. పీఎఫ్ విత్‌డ్రా చేయాలనుకునే వారు ఈ-నామినేషన్‌ నమోదు చెయ్యాలి. ఈ-నామినేషన్‌ పూర్తి చేయకపోతే డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.

అందుకు పీఎఫ్‌ ఖాతాదారులు ఈ-నామినేషన్‌ ప్రక్రియ ని పూర్తి చేసుకోండి. కానీ చాలా మందికి ఈ నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నప్పటికీ పూర్తి కావడం లేదంటే అందుకు కారణాలను తెలుసుకోండి. ఈ ప్రక్రియ అవ్వడం లేదంటే ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చెయ్యండి. ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకోకపోతే ఈ-నామినేషన్‌ పూర్తి కాదు.

దీని కోసం మొదట మీరు యూఏఎన్‌ నెంబర్‌ ఐడీ తో ఈపీఎఫ్‌ లో పోర్టల్‌ కి వెళ్లి లాగిన్‌ అవ్వండి.
ఆ తర్వాత మెనూ సెక్షన్‌ క్లిక్‌ చెయ్యండి.
అక్కడ ప్రొఫైల్‌ ఉంటుంది.
ప్రొఫైల్‌ మీద ప్రెస్ చేస్తే వ్యక్తిగత వివరాలను నమోదు చెయ్యచ్చు. మీకు ఎడమ వైపులో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది.
అక్కడ క్లిక్‌ చేసి ఫోటోను అప్‌లోడ్‌ చేయాలి.
ప్రొఫైల్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓలో మీ ఫోటో అప్‌లోడ్‌ చేయాలి.
తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news