పీఎఫ్ డబ్బులు అకౌంట్ లో స్ట్రక్ అయ్యాయా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఒక్కోసారి పీఎఫ్ అకౌంట్ లో డబ్బులు స్ట్రక్ అయ్యిపోతు ఉంటాయి. ఉద్యోగం మారినప్పుడో లేదు అంటే కొత్త జాబ్‌కి లింక్ చేసుకోలేకపోయినప్పుడో ఈ డబ్బులు తీసుకోవడం అవ్వదు. కొత్తగా జాబ్ మారినప్పుడు పాత దాన్ని అలానే వదిలేస్తారు.

కొన్ని సార్లు పాత కంపెనీలోని మీ పీఎఫ్ అకౌంట్ నెంబర్ మీకు గుర్తులేకపోతే యూఏఎన్‌కి మీ పాత పీఎఫ్ అకౌంట్‌‌ని ఎలా లింక్ చేసుకోవాలి..?, డబ్బులు ఎలా తీసుకోవాలి..? అనేది చూద్దాం. 36 నెలల పాటు పీఎఫ్ అకౌంట్లోకి మనీ క్రెడిట్ అవ్వకపోతే అకౌంట్ ఇన్‌ఆపరేటివ్ అయిపోతుంది.

అలానే ఆ కాలంలో ఎలాంటి విత్‌డ్రాయల్ అప్లికేషన్ రాకపోయినా కూడా అకౌంట్ ఇన్‌ఆపరేటివ్ అయిపోతుంది. ఇన్‌ఆపరేటివ్‌గా మారిన తర్వాత డబ్బులు తీసుకోవడం కష్టం. అయితే సమస్యను ఇలా పరిష్కరించుకోవచ్చు.

దీని కోసం ముందు ‘ఈపీఎఫ్ఓ’ వెబ్‌సైట్లోకి వెళ్లాలి.
‘అవర్ సర్వీసెస్’ను క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ‘ఫర్ ఎంప్లాయీస్’కి వెళ్లాలి. ఆ తరవాత సర్వీసెస్ అనే ట్యాబ్ తెరుచుకుంటుంది.
మీ మొబైల్ నెంబర్‌కి ఒక పిన్ కూడా వస్తుంది.
మీకు రిక్వెస్ట్‌కు సంబంధించిన రిఫరెన్స్ ఐడీ వస్తుంది.
దీని ద్వారా స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. సమస్య కూడా పరిష్కారం అవుతుంది.
తొలిసారి మీరు ఈ అభ్యర్థన పెట్టుకుంటున్నప్పుడు “First time user Click here to Proceed” అని క్లిక్ చేస్తారు.
ఈ డెస్క్‌ను సంప్రదించిన తర్వాత నుంచి ‘Existing User Click here to view status‘ను క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీరు మీ రిఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. మీ ఇన్‌ఆపరేటివ్ అకౌంట్‌కు సంబంధించిన స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
ఫర్ ఎంప్లాయీస్‌ను క్లిక్ చేసాక సర్వీసెస్ అనే ట్యాబ్ తెరుచుకుంటుంది.
ఈ ట్యాబ్‌లో చివరన ఇన్‌ఆపరేటివ్ అకౌంట్ హెల్ప్‌డెస్క్ ఉంటుంది.
ఆ తరవాత మీరు ‘First time user Click here to Proceed‘ అనే దానిపై క్లిక్ చేయాలి.
తొలిసారి ఈ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఒక మెసేజ్ బాక్స్ మీ ముందు తెరుచుకుంటోంది.
ఇందులో మీరు వెయ్యి పదాలలో సమస్యను చెప్పేయాలి.
నెక్ట్స్ బటన్ నొక్కాలి.
కొత్త విండోలో ఆ అకౌంట్‌కు సంబంధించి సమాచారాన్ని నమోదు చేయాలి.
ఇది మీ పీఎఫ్ అకౌంట్‌కి వెళ్లేందుకు సాయపడుతుంది.
ఇలా సమస్యను సాల్వ్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news