మహారాష్ట్ర, బీహార్ లో బర్డ్ ఫ్లూ కలకలం… బర్డ్ ఫ్లూ లక్షణాలు, రిస్క్ మొదలైన వివరాలివే..!

-

మరొకసారి భారతదేశంలో బర్డ్ ఫ్లూ సమస్య వచ్చింది. H591 బర్డ్ ఫ్లూ మహారాష్ట్ర మరియు బీహార్ లో కలకలం రేపుతోంది. పౌల్ట్రీ ఫార్మ్స్ లో పక్షులు ఈ వైరస్ బారిన పడి చనిపోయాయి. పౌల్ట్రీ రీసెర్చ్ ఫామ్ ఇన్ పాట్నా ప్రకారం 3859 పక్షులు ఉండగా… 787 పక్షులు మృతి చెందాయి. షాహాపూర్ దగ్గర 100 పక్షులు చనిపోయాయి. అయితే పూణే లో చేసిన రీసెర్చ్ ప్రకారం H591 ఇన్ఫ్లుఎంజా తో పక్షులు చనిపోయినట్లు తెలిసింది. అయితే అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి..?, చికెన్ మరియు గుడ్లు తినచ్చా తినకూడదా..? ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.

 

అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి..?

బర్డ్ ఫ్లూ లేదా ఇన్ఫ్లుఎంజా అనేది విపరీతంగా సోకుతుంది. ఇది పెంపుడు పక్షులుకి మరియు వైల్డ్ పక్షులకు కూడా సోకే అవకాశం ఉంది. ఇన్ఫెక్ట్ అయినా పక్షులు ద్వారా ఇది ఇంటస్టైన్స్ మరియు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కోళ్లు, బాతులు, టర్కీలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. మొట్టమొదటిసారి 1996లో బర్డ్ ఫ్లూ కేసులు చైనాలో వచ్చాయి. భారతదేశంలో అయితే మొట్ట మొదటిసారి 2006లో మహారాష్ట్రలో వచ్చాయి.

అసలు ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది…?

ఇది పక్షుల ద్వారానే సోకుతుంది. ఇన్ఫెక్ట్ అయిన పక్షుల విసర్జన నుంచి ఈ వైరస్ అనేది సోకుతుంది. ఎక్కువ సేపు ఇది వాతావరణంలో ఉంటుంది. సులువుగా స్ప్రెడ్ అవుతుంది. పక్షుల నుండి మనుషులకి సోకుతుంది. ఎవరైతే పక్షులకి దగ్గరగా ఉంటారో వాళ్లకి కూడా సోకే అవకాశం ఉంది. కనుక ఏదైనా పక్షి ఇన్ఫెక్ట్ అయ్యి దగ్గరగా వుండే మనుషుల్లో కూడా రెస్పిరేటరీ సమస్యలు వస్తాయి.

గుడ్లు లేదా చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా..?

చికెన్ లేదా గుడ్లు తింటే ఈ వైరస్ వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ సైంటిస్టులు 70 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత తో దీనిని తీసుకోవడం మంచిదని చెప్పారు. అదే గుడ్లు అయితే ఫ్రెష్ గా ఉండే గుడ్లను మాత్రమే వండుకోండి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news