జగ్గారెడ్డి నాకు మంచి మిత్రుడు.. ఇద్దరం కలిసి పనిచేస్తాం -రేవంత్ రెడ్డి

-

జగ్గారెడ్డి నాకు మంచి మిత్రుడు.. ఇద్దరం కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. జగ్గారెడ్డి ఇష్యూ మా దృష్టికి వచ్చిందని.. మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డి తో మాట్లాడుతున్నారన్నారు. జగ్గారెడ్డి మా నాయకుడు మా అధిష్టానం అపాయింట్ మెంట్ కోరాడని.. జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటామని పేర్కొనారు. సైబర్ పోలీసులకు పిర్యాదు చేస్తామని.. గతంలో విహెచ్ పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందన్నారు.

ఆరా తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందని.. జగ్గారెడ్డి ఇష్యూ .. మా కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని వెల్లడించారు. పీసీసీ చీఫ్ గా కొన్ని నేను బయటికి చెప్పలేనని.. జగ్గారెడ్డి నాకు వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితుడు అని చెప్పారు.

నేను రాజకీయాలకు రాకముందు కూడా జగ్గన్న నాకు పరిచయం వుందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకరావడానికి మేము అందరం కలిసి పనిచేస్తామని ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ లు వచ్చాయని కుంగిపోవద్దని.. మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారన్నారు. ఇలాంటి విషయంలో మరింతగా బలంగా ఉండాలని.. నాకు ఇలాంటివి సోషల్ మీడియా లో చాలా ఎదురయ్యాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news