పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్..!

-

వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కీలక ప్రకటన చేసారు. ఈపీఎఫ్ స్కీమ్ లో ట్యాక్స్ వర్తించే అంశంలో నాన్-పాన్ కేసులకు సంబంధించి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ (టీడీఎస్) ను 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నారట.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ లో మాత్రమే మార్పు చేసారు కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆదాయపు పన్ను నిబంధలన ప్రకారం ఈపీఎఫ్ ఖాతాదారు 5 ఏళ్లలోపే ఈపీఎఫ్ విత్ర్ డ్రా చేస్తుంటే ఆ డబ్బులకి ట్యాక్స్ వర్తిస్తుంది.

అలానే కాంట్రిబ్యూషన్ ఏడాదికి రూ.2.5 లక్షలకు మించితే ట్యాక్స్ వర్తిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలకు పాన్ కార్డ్ లింక్ చేయకపోతే ఈపీఎఫ్ స్కీమ్ నుండి ట్యాక్స్ వర్తించే నగదు ఉపసంహరణపై టీడీఎస్ రేటు 30 శాతంగా ఉంది. 20 శాతానికి దీన్ని తగ్గించేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది ఇది. నాన్-పాన్ కేసుల కి సంబంధించి పీఎఫ్ కొత్త విత్ డ్రా నిబంధనలపై ముంబయికి చెందిన ట్యాక్స్ నిపుణులు వివరించారు.

ఈ అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల లోపే విత్ డ్రా చేసినప్పుడు మొత్తం అమౌంట్‌‌కు ట్యాక్స్ వర్తిస్తుంది. పాన్ కార్డ్ లింక్ చేస్తే విత్ డ్రా చేసే నగదుకు టీడీఎస్ వర్తించదు. ఒకవేళ లింక్ చేయకపోతే ఆ ఖాతా నుంచి టీడీఎస్ అమౌంట్ కట్ చేస్తారు. 2023, ఏప్రిల్ 1 నుంచి 20 శాతానికి ఇది తగ్గుతుంది. 5 ఏళ్లకు ముందే పీఎం అమౌంట్ విత్ డ్రా చేస్తే ట్యాక్స్ చెల్లించాల్సిన మొత్తానికి కలిపి పన్ను పడుతుంది. పాన్ కార్డ్‌ను లింక్ చేస్తే దాని నుంచి తప్పించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news