ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల

-

ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఐ.పాండు రంగారెడ్డి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు.

పరీక్ష రాసేందుకు రెగ్యులర్‌ లేదా దూరవిద్యలో జనరల్‌ విద్యార్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని వర్సిటీ ప్రవేశాల విభాగం ప్రకటించింది. మరిన్ని వివరాలకు www.ouadmissions.com చూడాలని ప్రవేశాల విభాగం డైరెక్టర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో పీహెచ్‌డీ ప్రవేశాలను రెండు కేటగిరీలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ 1 కింద ప్రవేశాలకు జాతీయస్థాయి ఫెలోషిప్ పొందిన వారు అర్హులని అన్నారు.

ఈ కేటగిరీకి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత డీన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. కేటగిరీ 2 కింద ప్రవేశాలకు అభ్యర్థులు పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version