రాజు పక్కనే ఉన్నాడు..10 లక్షలు ఇస్తారా..? పోలీసులకు 5 వేల ఫోన్ కాల్స్..!

-

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆచూకీ తెలియకపోవడం తో పోలీసులు పది లక్షల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆచూకీ తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డును ఇస్తామని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే రాజు తన పక్కనే ఉన్నాడని దాదాపు 5వేల వరకు ఫోన్ కాల్స్ వచ్చాయట. కానీ అందులో దాదాపు అన్నీ ఫేక్ కాల్స్ కలిసి ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కేటుగాళ్లు ఫోన్ చేసి గంజాయి ఉందా… 10 లక్షలు నిజంగా ఇస్తారా అంటూ ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.

ఇక మరికొందరు అది రాజు ఫోన్ నెంబర్ అనుకొని ఫోన్ చేసి బూతులు తిట్టడం ప్రారంభించారట. దాంతో పోలీసులు తల పట్టుకున్నారు. అన్ని ఉత్తుత్తి కాల్స్ రావడం తో ఆ తర్వాత నమ్మకం గా అనిపించిన ఫోన్ కాల్స్ కే పోలీసులు రెస్పాండ్ అయ్యారట. ఇదిలా ఉంటే నిందితుడు రాజు పోలీసులకు చిక్కే లోపే భయంతో తో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో పోలీసులకు రిస్క్ లేకుండా రాజు చాప్టర్ క్లోజ్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version