మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలకు ఈరోజుతో ప్రచారం ముగిసింది.పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో పార్టీలు ఎలాంటి సింబల్స్ లేకుండా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసుకోవచ్చని CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘పోలింగ్ కేంద్రంలో ఒక పార్టీకి ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలి. ప్రిసైడింగ్ అధికారి తప్ప మిగతా ఎవరూ బూత్లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదు. నేతలు ఓటర్లను వాహనాల్లో తరలించకూడదు అని తెలిపారు. ఓటింగ్ శైలిని పర్య వేక్షించుకునేందుకు అభ్యర్థి 3 వాహనాలు ఉపయోగించుకోవచ్చు’ అని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకెవెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు.ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదన్నారు.అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించామని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని సీఈఓ మీనా అన్నారు.