బాపట్ల : సార్వత్రిక ఎన్నికలకు ఈ రోజే ప్రచారానికి చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నేతలు విస్తృతంగా పర్యటన లు ఈ నేపథ్యంలో పర్చూరు మండలం చింతపల్లిలో ప్రచారానికి వెళ్తున్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వాహనంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.ఎంపీ నందిగాం సురేష్ వాహనాన్ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయన వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడితో ఎంపి అనుచరులు ఆందోళనకు దిగారు. దీనికి నిరసనగా బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతుండగా ఆయనకి సంఘీభావంగా స్థానికులు కూడా రోడ్డుపై బైఠాయించారు.ప్రచారానికి వెళ్ళే వారిపై కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.