నేను ఈడి విచారణకు హాజరు కాలేను – రోహిత్ రెడ్డి

-

ఎమ్మెల్యేల ఎర కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేడు ఈడి విచారణకు దూరం కానున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో తాను ఈరోజు విచారణకు రాలేనంటూ ఆయన ఈడీకి మెయిల్ పంపారు.

కాగా ఈ కేసుకు సంబంధించి గత రెండు రోజులు ఈడీ రోహిత్ రెడ్డిని విచారించింది. ఈ క్రమంలోనే ఈరోజు కూడా రావాలంటూ ఈడి సూచించగా రాలేనంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఇక టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మళ్లీ రోహిత్‌రెడ్డిని ప్రశ్నించనుంది ఈడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version