PinkPromise : పింక్ జెర్సీలతో బరిలోకి దిగనున్న రాజస్థాన్ రాయల్స్

-

మరి కాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 19వ మ్యాచ్ జరుగుతుంది. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా 7: 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.అయితే ఆర్సీబీతో జరగనున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ పూర్తి పింక్ జెర్సీలో బరిలోకి దిగనుంది. మహిళల సాధికారత, అభ్యున్నతే లక్ష్యంగా #PinkPromise మిషన్ కింద రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ మ్యాచ్కు విక్రయించే ప్రతి టికెట్ నుంచి రూ. 100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్లో ప్రతి సిక్స్ కి రాజస్థాన్లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించనున్నారు.

కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లోనూ విజయం సాధించగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకోగలిగింది.

Read more RELATED
Recommended to you

Latest news