ఉపాధి హామీ పథకం పై 497 పిటిషన్లు.. !

ఉపాధి హామీ పథకం పనుల పై హైకోర్టులో ఏకంగా 492 పిటిషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అన్ని కేసులలో విజిలెన్స్ విచారణ వేశామని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. కాగా అన్ని కేసులలో విజిలెన్స్ విచారణ వేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు.100 పిటిషన్ల విషయంలో డబ్బులు చెల్లించామని ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పష్టం చేశారు.

అయితే ఏ కేసులో ఎంత డబ్బు చెల్లించారో.. విజిలెన్స్ విచారణ ఎంతవరకు వచ్చింది..? పిటిషనర్ ల సమక్షంలోనే విచారణ చేస్తున్నారా.. విచారణ ఎప్పుడు చేశారు లాంటి వివరాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయిన 20 శాతం మినహాయించి బిల్లులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తూ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.