కేసీఆర్ మాటల్లో పస లేదని…హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లో కొట్టుకుపోతాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే ….కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు,గిరిజనుల నుంచి గుంజుకున్నారని మండిపడ్డారు. ఏడేళ్ళల్లో దళిత గిరిజనులను కేసీఆర్ వంచించారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ను బజారు కీడ్చి…బంజరు దొడ్డిలోకి పంపుతామని హెచ్చరించారు.
దళిత బంధు కాదు…కేసీఆర్ రాబంధు అని మండిపడ్డ రేవంత్.. హుజురాబాద్ ఉప ఎన్నికల తుఫాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఆ కుర్చీ మీద నీకు ఎందుకు మమకారం… ఎప్పుడు వుంటావా ? అని నిలదీశారు.ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ నిర్వహిస్తున్నామని… ఆ తర్వాత హుజురాబాద్ పై దండేత్తుతమని పేర్కొన్నారు. రాజకీయంగా ఇవాళ కేసీఆర్ కి ఇదే చివరి ప్రసంగమని.. కేసీఆర్ మాటల్లో పస లేదు…ప్రజలకు ప్రయోజనం లేదని చురకలు అంటించారు రేవంత్ రెడ్డి.