బిగ్ బ్రేకింగ్: ఐపిఎల్ 14 నిరవధిక వాయిదా

ఐపిఎల్ లో కరోనా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఐపిఎల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపిఎల్ లో పలువురు కీలక ఆటగాళ్లకు కరోనా సోకినా నేపధ్యంలో ఐపిఎల్ 14 ని నిరవధికంగా వాయిదా వేస్తున్నామని ఐపిఎల్ యాజమాన్యం ప్రకటన చేసింది. రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన చేసారు. తాజాగా హైదరాబాద్ ఆటగాడు వ్రుద్దిమాన్ సాహా కరోనా బారిన పడ్డాడు.

కరోనా కేసులు తీవ్రంగా ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఐపిఎల్ మ్యాచ్ లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే కలకత్తా ఆటగాళ్లకు కొందరికి కరోనా సోకింది. ఈ నేపధ్యంలో మ్యాచ్ లను నిర్వహిస్తే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముందు షెడ్యూల్ ని కొనసాగిస్తామని ఏ విధమైన మార్పులు లేవని చెప్పిన బోర్డ్… ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.