ఇక రేషన్ షాపుల ద్వారా చిన్న ఎల్పీజీ సిలిండర్లను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మోడీ సర్కారు తాజాగా స్పష్టం చేసింది. పిటిఐ కథనం ప్రకారం.. ఆహార కార్యదర్శి సుధాంశు పాండే అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కాకుండా సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ తో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఎఫ్ పి ఎస్ ఆర్థిక సాధ్యతను పెంపొందించడానికి బలమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎఫ్ పి ఎస్ ద్వారా చిన్న ఎల్పీజీ సిలిండర్ల రిటైల్ విక్రయాల ప్రణాళిక పరిశీలనలో ఉందని ప్రకటించింది కేంద్రం.