ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్ర‌మంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక ప్లాస్టిక్ పూర్తిగా కనుమరుగవనుంది. పర్యావరణానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి సీఎం కేసీఆర్ సంకల్పించారు. 30 రోజుల ప్రణాళిక విజయవంతమైందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన జనంలో వచ్చిందని, దీని కారణమైన గ్రామ కార్యదర్శులు, డీపీవోలు, డీఎల్ పీవోలు, సర్పంచులకు అభినందనలు తెలిపారు.

ప్రతీ నెల పంచాయతీలకు రూ.339 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని వెల్లడించారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని ఆయన నిర్ణయించినట్లుగా తెలిపారు. దీనికి అవసరమైన విధివిధానాలు రూపకల్పన చేయాలని సీఎం ఆదేశాల జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version