‘దుఖంలో ఉన్న కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయండి ప్లీజ్’.. విజయ్ వర్మ ట్వీట్..!

-

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం విధితమే. సెప్టెంబర్ 11న మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న ముంబయి లో అనిల్ అరోరా అంత్యక్రియలు జరిగాయి. తీవ్ర దు:ఖంలో ముగినిపోయిన మలైకాను ఓదార్చారు పలువురు బాలీవుడ్ ప్రముఖులు.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. మలైకా అరోరా బయట ఎక్కడ కనిపించినా ప్రశ్నలు అడుగుతూ ఆమెను ఇబ్బంది పెట్టవద్దు. ఇది నా విజ్ఞప్తి. ప్లీజ్ దుఖంలో ఉన్న కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయండి. ఆ బాధలో నుంచి కోలుకోవడం వారికి అంత సులభం కాదు. వారికి అత్యంతమైన కష్టమైన సమయం ఇది. దయచేసి మీడియా వ్యక్తులు కూడా మలైకా కుటుంబం పై దయ చూపండి అంటూ ట్వీట్ చేశారు విజయ్ వర్మ. మరోవైపు నిన్న  అనిల్ అరోరా అంత్య క్రియల సమయంలో మలైకా మీడియా ఫొటోలు తీయడం పై వరుణ్ ధావన్ మీడియా వారిపై ఫైర్ అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Latest news