దేశంలోని రైతు సోదరులకు బిగ్ అలెర్ట్. రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకం ద్వారా డబ్బులు పొందుతున్న ప్రతి ఒక్క రైతు e-KYC తప్పక చేసుకోగలని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. e-KYC చేయించుకోనిచో 11వ. వాయిదా డబ్బులు జమకావని స్పష్టం చేసింది.
కావున మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకం ద్వారా సంవత్సరంకు 6000/- లబ్ది పొందుతున్న ప్రతీ ఒక్క రైతు మీ సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) సేవ కేంద్రంలో e-KYC చేసుకోవాలి. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టి e-KYC చేసుకోవలిసి ఉంటుంది.
లేదా మొబైల్ స్మార్ట్ ఫోన్ లోనే https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx లింక్ పైన క్లిక్ చేసి ఓ.టి. పి(OTP) సేవ ద్వారా e-KYC చేసుకోగలరు. e-KYC చేయనిచో మీ ఖాతాలో డబ్బులు జమ కావు. రైతులు గమనించి తొందరగా e-KYC చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.